హనుమాన్ : రఘునందన పూర్తి వీడియో సాంగ్ అవుట్

by సూర్య | Tue, Feb 20, 2024, 05:31 PM

పాన్ ఇండియా రేంజ్ లో ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన సూపర్ హీరో సినిమా 'హను-మాన్' లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించాడు. ఈ చిత్రం జనవరి 12, 2024న వెండితెరపైకి వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల  పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి రఘునందన పూర్తి వీడియో సాంగ్ ని విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది.


అమృత అయ్యర్ ఈ సినిమాలో తేజ సరసన నటిస్తుంది. ఈ సినిమాలో  వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్‌కుమార్, దీపక్ శెట్టి, గెటప్ శ్రీను, సత్య మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. అనుదీప్ దేవ్, హరి గౌర, జై క్రిష్ మరియు కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌లు అందిస్తున్నారు. కె నిరంజన్ రెడ్డి తన ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై హను-మాన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
'కల్కి 2898 AD' సినిమాలో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ Sun, Apr 21, 2024, 09:54 PM
ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న నిధి అగ ర్వాల్‌ Sun, Apr 21, 2024, 10:59 AM
రజినీ సినిమా నాగార్జున? Sun, Apr 21, 2024, 10:47 AM
'సింగం ఎగైన్' మాస్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ Sat, Apr 20, 2024, 07:25 PM
'బ్రహ్మాస్త్ర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Apr 20, 2024, 07:23 PM