ఫిబ్రవరి 23న విడుదల కానున్న 'భ్రమయుగం'

by సూర్య | Tue, Feb 20, 2024, 01:38 PM

కొందరు నటులు తమ నటనా నైపుణ్యంతో భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకుంటారు. మలయాళ మెగాస్టార్, విల‌క్ష‌ణ న‌టుడు మమ్ముట్టి అటువంటి లెజెండరీ నటుడే. ఆయన నటించిన సినిమా వస్తుందంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఏదో ప్ర‌త్యేక‌త ఉంటుంద‌ని అనుకుంటుంటారు. తాజాగా ఆయ‌న‌ ప్రధాన పాత్రలో న‌టించిన చిత్రం 'భ్రమయుగం'. సైకలాజికల్ హారర్, థ్రిల్లర్ జాన‌ర్‌లో వ‌చ్చిన‌ ఈ చిత్రం పూర్తిగా బ్లాక్ అండ్ వైట్‌లో రూపొందించబ‌డ‌డం విశేషం.నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్‌ పతాకాలపై చక్రవర్తి రామచంద్ర, ఎస్. శశికాంత్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల మలయాళంలో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వైవిధ్యమైన ఈ సినిమా కథాంశానికి, ఇందులో మమ్ముట్టి అద్భుత నటనను ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. మమ్ముట్టితో పాటు అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ వంటి నటీనటులు కూడా అద్భుతంగా నటించి మెప్పించిన ఈ చిత్రం.. ప్రేక్షకులకు వెండితెరపై ఓ కొత్త అనుభూతిని అందిస్తోంది. ప్రతి సినీ ప్రియుడు తప్పక చూసి అనుభూతి చెందాల్సిన సినిమా అని ప‌బ్లిక్ టాక్ కూడా వ‌చ్చేసింది. ఇప్ప‌టికే ఈ సినిమా రోజురోజుకి థియేట‌ర్ల సంఖ్య‌ను పెంచుకుంటూ రూ.40 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్లు రామబ‌ట్లి కేర‌ళ‌లో అల్‌టైమ్ రికార్డుల వైపు దూసుకెళుతోంది. అయితే ఇప్పుడు ఈ 'భ్రమయుగం'  సినిమా తెలుగు వారిని అల‌రించేందుకు సిద్ధ‌మైంది. తెలుగులో వైవిధ్య‌భ‌రిత‌, ఆసక్తికరమైన చిత్రాలను నిర్మిస్తూ.. ఆగ్ర నిర్మాత‌గా పేరు తెచ్చుకున్న‌ సూర్యదేవర నాగ వంశీ నేతృత్వంలోని ప్రతిష్టాత్మక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్  ఈ చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేయ‌నుంది. ఈ సినిమాను ఫిబ్రవరి 23న రెండు తెలుగు రాష్టాల‌లో చాలా థియేట‌ర్ల‌లో విడుదల చేయ‌నున్నారు. ఇదిలాఉండ‌గా గ‌తంలోనూ సితార సంస్థ ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన‌ 'లియో' చిత్రాన్ని విడుదల చేయ‌గా మంచి విజ‌యం సాధించింది.

Latest News
 
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM