భారీ మొత్తానికి అమ్ముడయిన 'హాయ్ నాన్నా' డిజిటల్ హక్కులు

by సూర్య | Sat, Dec 09, 2023, 09:10 PM

నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన 'హాయ్ నాన్నా' సినిమా డిసెంబర్ 7, 2023న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సీతా రామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో నానికి జోడిగా నటిస్తుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ 37 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నట్లు సమాచారం.

ఈ పాన్-ఇండియన్ చిత్రంలో బేబీ కియారా, జయరామ్, ప్రియదర్శి, శ్రుతి హాసన్ మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. ప్రముఖ మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హృదయం ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల మరియు మూర్తి KS ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
'ఓం భీమ్ బుష్‌' మూవీ టీజర్ రిలీజ్ Mon, Feb 26, 2024, 09:03 PM
'హనుమాన్' నుండి పూలమ్మే పిల్ల లిరికల్ సాంగ్ అవుట్ Mon, Feb 26, 2024, 08:51 PM
6.5M+ వ్యూస్ ని సాధించిన 'భీమా' ట్రైలర్ Mon, Feb 26, 2024, 08:43 PM
'బడే మియాన్ చోటే మియాన్‌' ఓవర్సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Mon, Feb 26, 2024, 08:37 PM
'దేవర' షూటింగ్ లో జాయిన్ అయ్యిన మరాఠి బ్యూటీ Mon, Feb 26, 2024, 08:35 PM