'మెర్రీ క్రిస్మస్' ట్రైలర్ విడుదల అప్పుడేనా?

by సూర్య | Sat, Dec 09, 2023, 09:06 PM

శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఒక హిందీ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాకి 'మెర్రీ క్రిస్మస్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను డిసెంబర్ 3వ వారంలో విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీ జనవరి 12, 2024న విడుదల కానుంది. ఈ హిందీ వెర్షన్‌లో సంజయ్ కపూర్, వినయ్ పాఠక్, ప్రతిమ కన్నన్ మరియు తిను ఆనంద్ నటించగా, తమిళ వెర్షన్‌లో రాధికా శరత్‌కుమార్, షణ్ముగరాజా, కెవిన్ జై బాబు మరియు రాజేష్ విలియమ్స్ అదే పాత్రల్లో నటించారు. మెర్రీ క్రిస్మస్ సినిమాకి ప్రీతమ్ సంగీతం అందించారు. మ్యాచ్‌బాక్స్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి రమేష్ తౌరానీ టిప్స్ ఇండస్ట్రీస్ ఈ సినిమాని నిర్మించారు.

Latest News
 
'రాయన్' నుండి అపర్ణ బాలమురళి పోస్టర్ అవుట్ Mon, Feb 26, 2024, 08:02 PM
'యాత్ర 2' డిజిటల్ ఎంట్రీపై లేటెస్ట్ అప్డేట్ Mon, Feb 26, 2024, 07:59 PM
DNSని నార్త్ అమెరికాలో విడుదల చేయనున్న ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ హౌసేస్ Mon, Feb 26, 2024, 07:56 PM
ఓవర్సీస్ లో $2.5M మార్క్ దిశగా 'తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా' Mon, Feb 26, 2024, 07:52 PM
'సరిపోదా శనివారం' గ్లింప్సె కి సాలిడ్ రెస్పాన్స్ Mon, Feb 26, 2024, 07:49 PM