by సూర్య | Sat, Dec 09, 2023, 09:12 PM
జాతీయ అవార్డు గ్రహీత రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో కన్నడ నటి రష్మిక మందన్న తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'గర్ల్‌ఫ్రెండ్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభం అయ్యింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా కోసం రష్మిక 3 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో మాస్ మూవీ మేకర్స్ మరియు ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై విద్యా కొప్పినీడి మరియు ధీరజ్ మొగిలినేని నిర్మించారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.