బాక్స్ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తున్న 'యానిమల్'

by సూర్య | Sat, Dec 09, 2023, 07:27 PM

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమా థియేటర్లలో విడుదలైంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యాక్షన్ డ్రామా విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద కేవలం విడుదలైన 8 రోజుల్లో 600.67 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. Xలో కొత్త పోస్టర్‌ను విడుదల చేయడం ద్వారా మూవీ మేకర్స్ అదే విషయాన్ని ధృవీకరించారు.

ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటించింది. అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి దిమ్రీ, చారు శంకర్, బబ్లూ పృథ్వీరాజ్ మరియు శక్తి కపూర్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ పతాకాలపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్ మరియు మురాద్ ఖేతాని నిర్మించిన ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.

Latest News
 
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM
'సింగం ఎగైన్' లో బాలీవుడ్ సూపర్‌స్టార్ Thu, Sep 19, 2024, 07:19 PM