అలియా భట్ గిఫ్ట్: కారు డ్రైవర్ కి, పనిమనిషికి కోటి రూపాయలు

by సూర్య | Tue, Mar 19, 2019, 06:15 PM

ఫిలిం మేకర్  మహేష్ భట్ కూతురిగా ఎంట్రీ ఇచ్చింది అలియా భట్ . అనతి కాలంలోనే బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. పలు సుపూర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంశలు దక్కించుకుంది.  ఈ నెల 15వ తేదీన అలియా  తన పుట్టినరోజు వేడుకను జరుపుకుంది. ఈ సందర్భంగా ఆమె తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది.

బాలీవుడ్ బ్యూటీ  అలియా భట్ కారు డ్రైవర్ గా 'సునీల్' .. ఆమె పనిమనిషిగా 'అమోల్' చాలా కాలంగా పనిచేస్తున్నారు. తన దగ్గర చాలా కాలంగా .. చాలా నమ్మకంగా పనిచేస్తోన్న ఈ ఇద్దరికీ, ఈ పుట్టినరోజు సందర్భంగా చెరో గిఫ్ట్ ఇవ్వాలని అలియాభట్ నిర్ణయించుకుందట. ఇద్దరికీ కూడా చెరో 50 లక్షలు పెట్టి ఇల్లు కొనిపెట్టేసింది. ఆ ఇద్దరి కోసం ఆమె అలా కోటి రూపాయలను ఖర్చు చేయడం బాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె మంచి మనసును గురించి అంతా చెప్పుకుంటున్నారు.

Latest News
 
'డార్లింగ్' లో తన భాగాన్ని పూర్తి చేసుకున్న నభా నటేష్ Tue, May 07, 2024, 04:31 PM
త్వరలో ఆహాలో మెరవనున్న 'విద్యా వాసుల అహం' Tue, May 07, 2024, 04:29 PM
'మైదాన్' డిజిటల్ ఎంట్రీపై లేటెస్ట్ బజ్ Tue, May 07, 2024, 04:27 PM
'పుష్ప' నా కోసం ఏమీ చేసిందని నేను అనుకోను - ఫహద్ ఫాసిల్ Tue, May 07, 2024, 04:05 PM
బజ్ : ఆర్యన్ ఖాన్ యొక్క 'స్టార్‌డమ్' డిజిటల్ రంగప్రవేశం అప్పుడేనా Tue, May 07, 2024, 04:02 PM