by సూర్య | Wed, Dec 06, 2023, 08:42 PM
నేచురల్ స్టార్ నాని నటించిన పాన్-ఇండియన్ చిత్రం హాయ్ నాన్నా చిత్రం డిసెంబర్ 7, 2023న పలు భాషల్లో విడుదల కానుంది. నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని సరసన మృణాల్ ఠాకూర్ జోడిగా నటిస్తుంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, హాయ్ నాన్నా సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 20.10 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.
ఈ చిత్రంలో శృతి హాసన్, బేబీ కియారా ఖన్నా, ప్రియదర్శి, జయరామ్ మరియు ఇతరలు ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు.
'హాయ్ నాన్నా' ప్రీ రిలీజ్ బిజినెస్ :::::::
నైజాం : 8.50 కోట్లు
సీడెడ్ : 2.60 కోట్లు
ఆంధ్రప్రదేశ్ : 9 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 20.10 కోట్లు