by సూర్య | Wed, Dec 06, 2023, 08:46 PM
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే. ఈ మూవీకి 'గుంటూరు కారం' అని టైటిల్ మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా ఇప్పుడు 'గుంటూరు కారం' టీమ్ మహేష్ మరియు శ్రీలీలపై టాకీ పార్ట్ మరియు పాట షూటింగ్ కోసం కేరళకు వెళ్లింది. నాన్‌స్టాప్ షెడ్యూల్ ప్లాన్ చేసి ఈ నెలాఖరులోగా సినిమాను ముగించటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
200 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. జగపతిబాబు విలన్‌గా నటిస్తున్న ఈ సినిమా జనవరి 13, 2024న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలకి సిద్ధంగా ఉంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.