'హాయ్ నాన్నా' వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్

by సూర్య | Wed, Dec 06, 2023, 08:16 PM

నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని తన 30వ చిత్రాన్ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి హాయ్ నాన్నా అనే టైటిల్‌ను మూవీ మేకర్స్ ఖరారు చేసారు. ఈ సినిమా డిసెంబర్ 7, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 27.60 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.

ఈ పాన్-ఇండియన్ చిత్రంలో బేబీ కియారా, జయరామ్, ప్రియదర్శి, శ్రుతి హాసన్ మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. సీతా రామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో నానికి జోడిగా నటిస్తుంది. ప్రముఖ మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హృదయం ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల మరియు మూర్తి KS ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


'హాయ్ నాన్నా' ప్రీ రిలీజ్ బిజినెస్ ::::::::
తెలుగు రాష్ట్రాలు : 20.10 కోట్లు
KA + ROI : 2.00 కోట్లు
OS : 5.50 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 27.60 కోట్లు

Latest News
 
ఓవర్సీస్ పార్టనర్ ని లాక్ చేసిన 'UI' Fri, Oct 18, 2024, 03:53 PM
'దేవర' కోసం సైఫ్ అలీఖాన్ భారీ రెమ్యునరేషన్ Fri, Oct 18, 2024, 03:42 PM
'మట్కా' ఫస్ట్ సింగల్ లిరికల్ షీట్ రిలీజ్ Fri, Oct 18, 2024, 03:38 PM
'రివాల్వర్ రీటా' టైటిల్ టీజర్ అవుట్ Fri, Oct 18, 2024, 03:33 PM
కంగనా 'ఎమర్జెన్సీ' రన్‌టైమ్ లాక్ Fri, Oct 18, 2024, 03:26 PM