'ఫైటర్' నుండి అనిల్ కపూర్ క్యారెక్టర్ పోస్టర్ అవుట్

by సూర్య | Wed, Dec 06, 2023, 07:50 PM

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'ఫైటర్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఇప్పటికే చిత్రబృందం ప్రొడక్షన్‌ను పూర్తి చేసింది. తాజాగా చిత్ర బృందం అనిల్ కపూర్ క్యారెక్టర్ పోస్టర్‌ని విడుదల చేసారు. ఈ చిత్రంలో గ్రూప్ కెప్టెన్ రాకేష్ జై సింగ్ (రాకీ) అనే పాత్రలో నటిస్తున్నట్లు సమచారం.

ఈ చిత్రంలో హృతిక్ సరసన గార్జియస్ బ్యూటీ దీపికా పదుకొణె జంటగా నటిస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.


ఈ భారతదేశపు మొట్టమొదటి వైమానిక యాక్షన్ చిత్రం ఫైటర్ జనవరి 25, 2024న ప్రపంచవ్యాప్తంగా స్క్రీన్‌లను విడుదల చేయడానికి లాక్ చేయబడింది. వయాకామ్ 18 స్టూడియోస్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి విశాల్-షేక్ సంగీతం అందించనున్నారు.

Latest News
 
'SDGM' ఫస్ట్ లుక్ విడుదలకి టైమ్ లాక్ Fri, Oct 18, 2024, 07:38 PM
'తలపతి69' లో విజయ్ పాత్రపై లేటెస్ట్ అప్డేట్ Fri, Oct 18, 2024, 07:32 PM
డబ్బింగ్ పూర్తి చేసుకున్న 'క' Fri, Oct 18, 2024, 07:25 PM
రొమాంటిక్ డ్రామాలో సిద్ధార్థ్ మల్హోత్రా - కియారా అద్వానీ Fri, Oct 18, 2024, 07:21 PM
'కింగ్‌' లో షారూఖ్ ఖాన్ పాత్ర రివీల్ Fri, Oct 18, 2024, 07:14 PM