హౌస్ ఫుల్5 అప్‌డేట్‌ను ఇచ్చిన మేకర్స్

by సూర్య | Wed, Dec 06, 2023, 12:01 PM

అక్షయ్ కుమార్ మరోసారి ప్రేక్షకులను నవ్వించడానికి సిద్ధమయ్యాడు. ఇండియా బిగ్గెస్ట్ కామెడీ ఫ్రాంచైజీగా గతంలో నాలుగు భాగాలుగా వచ్చి మంచి ప్రేక్షకాదరణ పొందిన హౌస్ ఫుల్ సిరీస్ లో మరో సిరీస్‌ తీసుకువచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ మేరకు సోమవారం హౌస్ ఫుల్5 సినిమా అప్‌డేట్‌ను, విడుద‌ల తేదీని ఆఫీసియల్‌గా వెళ్లడించారు.సాజిద్ నడియావాలా నిర్మించనున్న ఈ సినిమాకు తరుణ్ మన్సుఖాని దర్శకత్వం వహించారు. గతంలో ఈ సిరిస్ లో వచ్చిన హౌస్ ఫుల్1, 2 చిత్రాల‌కు సాజిద్ ఖాన్, పార్ట్ 3కి సాజిద్ స‌మ్జి, ప‌ర్హాద్ స‌మ్జి, పార్ట్ 4కి ప‌ర్హాద్ స‌మ్జి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ఈ చిత్రాలు ఒక‌దాన్ని మించి మ‌రొక‌టి విజ‌యం సాధించ‌డ‌మే కాక ప్రేక్ష‌కుల‌కు ఎన‌లేని కామెడీని అందించాయి. ముఖ్యంగా నాలుగో భాగంలో బాల బాల అనే పాట ప్రపంచ వ్యాప్తంగా ఎనలేని క్రేజ్ తీసుకు వచ్చింది.మొదటి నాలుగు భాగాలలో నటించిన అక్షయ్ కుమార్, రితేశ్ దేశ్ ముఖ్ లు ప్రధాన పాత్రల్లో నటించనుండగా కథానాయికలను త్వరలో ఎంపిక చేయనున్నారు. అయితే ఈ సినిమాను 2024 దీపావ‌ళికి విడుద‌ల చేయ‌నున్న‌ట్లు హీరోలు, మేక‌ర్స్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ ఇప్పుడు సినిమాలో గ్రాఫిక్స్‌, వీఎఫ్ఎక్స్ భారీగా, హై స్టాండ‌ర్డ్స్‌లో చేస్తుండ‌డంతో ఇప్పుడు సినిమాను 2025 జూన్‌ 6న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు నిర్మాణ సంస్థ సామాజిక మాధ్య‌మం ఎక్స్‌లో ఓ పోస్టు చేసింది.

Latest News
 
'అమరన్' ట్రైలర్ అవుట్ Wed, Oct 23, 2024, 08:30 PM
ధనుష్, ఐశ్వర్య షాకింగ్ నిర్ణయం Wed, Oct 23, 2024, 07:42 PM
వార్ 2: హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ పరిచయ సన్నివేశాల గురించి ఆసక్తికరమైన బజ్ Wed, Oct 23, 2024, 07:36 PM
గజిని-2పై అల్లు అరవింద్ ఫోకస్! Wed, Oct 23, 2024, 07:34 PM
'క' ట్రైలర్ విడుదలకి టైమ్ లాక్ Wed, Oct 23, 2024, 07:31 PM