ఓవర్సీస్‌లో ‘బాహుబలి-2’ రికార్డును బ్రేక్‌ చేసిన ‘యానిమల్‌’

by సూర్య | Wed, Dec 06, 2023, 12:02 PM

ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘యానిమల్‌’  చిత్రం హీరో రణ్‌బీర్‌ కపూర్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. మంచి వసూళ్లను సాధిస్తూ రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పుడీ చిత్రం ‘బాహుబలి-2’ రికార్డును బ్రేక్‌ చేసింది. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఓవర్సీస్‌లో 633 థియేటర్లలో విడుదల చేశారు. అక్కడ నాలుగు రోజుల్లో ఏకంగా ఏడు లక్షల డాలర్లకు పైగా ఈ చిత్రం వసూళ్లు రాబట్టింది. దీంతో వసూళ్లలో ‘బాహుబలి-2’ రికార్డును అధిగమించింది. ‘బాహుబలి-2’ అక్కడ ఐదు లక్షల డాలర్లు కలెక్ట్‌ చేసింది. ఆ రికార్డును సందీప్‌ వంగా ‘యానిమల్‌’ కేవలం నాలుగు రోజుల్లోనే అధిగమించడం విశేషం. ఈ ఏడాది ఓవర్సీస్‌లో ఏడు లక్షల డాలర్ల కలెక్షన్స్‌ సాధించిన ఐదో భారతీయ చిత్రంగా ‘యానిమల్‌’ నిలిచింది. ‘యానిమల్‌’ ఇప్పటిదాకా మొత్తం రూ.425కోట్ల (గ్రాస్‌) వసూళ్లు చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ హవా ఇలాగే కొనసాగితే రెండు రోజుల్లో రూ.500కోట్లు సాధించడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Latest News
 
సైలెంట్‌గా 2 సినిమాలను పూర్తి చేసిన అనుష్క శెట్టి Wed, Oct 23, 2024, 05:40 PM
పెళ్లి వీడియోతో షాక్ ఇచ్చిన కళ్యాణి ప్రియదర్శన్ Wed, Oct 23, 2024, 05:35 PM
ప్రొడ్యూసర్ విక్రమ్ రెడ్డి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'విశ్వంభర' టీమ్ Wed, Oct 23, 2024, 05:28 PM
'అర్థమైంద అరుణ్ కుమార్' సీజన్ 2 ట్రైలర్ అవుట్ Wed, Oct 23, 2024, 05:24 PM
బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌, కల్కి లాంటి ల్యాండ్‌మార్క్ మూవీ కంగువ - సూర్య Wed, Oct 23, 2024, 05:17 PM