ఆమె కెరీర్ ఆయనతోనే ముడిపడిఉందా ...?

by సూర్య | Wed, Dec 06, 2023, 11:57 AM

గత సంవత్సరం తమిళ సినిమా 'లవ్ టుడే' విడుదలై పెద్ద సంచలనం సృష్టించింది. ఆ సినిమాని అదే పేరుతో తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు, తెలుగులో కూడా బాగానే ఆడింది. ఆ సినిమాలో నటించిన కథానాయకురాలు ఇవానాకు మంచి పేరు కూడా వచ్చింది. ఆ సినిమా విడుదలయ్యాక దిల్ రాజు తన అన్న కుమారుడు ఆశిష్ ని కథానాయకుడిగా 'సెల్ఫిష్' అనే సినిమాకి శ్రీకారం చుట్టారు. ఇందులో 'లవ్ టుడే' కథానాయకురాలు ఇవానా ని తీసుకున్నారు.ఆమెతో రెండు సినిమాలకి గాను దిల్ రాజు ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఆ రెండు సినిమాలు అయ్యే వరకు ఇవానా వేరే తెలుగు సినిమా చెయ్యకూడదు అని దిల్ రాజు షరతు పెట్టినట్టుగా వార్త వస్తోంది. అందుకనే ఇవానా కి తెలుగులో చాలా సినిమాలు వస్తున్నాయి, కానీ దిల్ రాజు తో కుదిరిన ఒప్పందం వలన ఆమె వేరే తెలుగు సినిమా చేయలేకపోతోంది అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది.అయితే ఇవానా కూడా దిల్ రాజు మామూలుగా సినిమాలు తొందరగా తీస్తారు అని పేరుంది అని అతనితో ఈ షరతులకు ఒప్పుకుంది అని, అయితే దిల్ రాజు 'సెల్ఫిష్' సినిమా మొదలయ్యి ఏడాది అయినా ఇంకా తీస్తూనే వున్నారు అని టాక్. ఈ సినిమా ఇప్పుడు మళ్ళీ రీషూట్ కూడా చేస్తున్నారని వినికిడి. దీనితో ఇవానా కెరీర్ ఇప్పుడు చిక్కులో పడినట్టుగా అయింది. ఎందుకంటే ఆమె వేరే తెలుగు సినిమా చెయ్యలేదు, ఇప్పుడు చేస్తున్న సినిమా అంత తొందరగా అయ్యేట్టు కనిపించడం లేదు. అది అయితే కానీ, వేరే ప్రాజెక్ట్ ఒప్పుకోవడానికి లేదు అని దిల్ రాజు ఖరాఖండీగా చెప్పినట్టు భోగట్టా.


 

Latest News
 
'అమరన్' ట్రైలర్ అవుట్ Wed, Oct 23, 2024, 08:30 PM
ధనుష్, ఐశ్వర్య షాకింగ్ నిర్ణయం Wed, Oct 23, 2024, 07:42 PM
వార్ 2: హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ పరిచయ సన్నివేశాల గురించి ఆసక్తికరమైన బజ్ Wed, Oct 23, 2024, 07:36 PM
గజిని-2పై అల్లు అరవింద్ ఫోకస్! Wed, Oct 23, 2024, 07:34 PM
'క' ట్రైలర్ విడుదలకి టైమ్ లాక్ Wed, Oct 23, 2024, 07:31 PM