'సలార్' సినిమాలో ప్రభాస్ పాత్ర ఎంత సేపు?

by సూర్య | Wed, Dec 06, 2023, 11:56 AM

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న 'సలార్' సినిమా ట్రైలర్ నిన్న డిసెంబర్ 1న విడుదలైంది. ఈ ట్రైలర్ కి మిశ్రమ స్పందన లభించింది. ఇది కూడా కెజిఎఫ్ లానే ఉంటుందని కొందరు అంటే, కాదు అదే నేపధ్యం కానీ కథ వేరేగా ఉండొచ్చు అని ఇంకొందరు ఇలా ఎవరికీ తోచింది వారు అంటున్నారు. అయితే విడుదలైన ట్రైలర్ లో ప్రభాస్ కనిపించింది ఇంచుమించు రెండో నిముషం వచ్చేసరికి. అంటే ప్రభాస్ చిన్నప్పటి సన్నివేశాలు కూడా సినిమాలో ఉన్నాయని దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పకనే చెప్పారు.అయితే ట్రైలర్ లోనే ఇంతసేపు చిన్నప్పటి ప్రభాస్ ని చూపిస్తే మరి సినిమాలో ఇది ఎంతసేపు ఉంటుంది అని అందరికి ఆసక్తి పెరిగింది. పరిశ్రమలో ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ఏంటంటే సినిమా మొదలైన 40 నిముషాల వరకు ప్రభాస్ కనిపించరు అని, ఆ తరువాత మాత్రమే తెరమీదికి వస్తారు అని. దీనితో ప్రభాస్ అభిమానులు కొంచెం డీలా పడుతున్నారు అని కూడా అంటున్నారు. సినిమాలో ప్రధాన కథానాయకుడు అంతసేపు సినిమాలో కనిపించపోతే, అందులోకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు వున్న ప్రభాస్ లాంటి నటుడు కనిపించకపోతే, అభిమానులు ఊరుకుంటారా. దర్శకుడు ప్రశాంత్ నీల్ ట్రైలర్ లోనే చాలాసేపు ప్రభాస్ కుర్రాడిగా వుండే సన్నివేశాలని అంతసేపు చూపించారు అంటేనే అర్థం అవుతోంది అని అందరూ అంటున్నారు. అదీ కాకుండా, ఈ ట్రైలర్ కి మిశ్రమ స్పందన రావటంతో కొన్ని రోజుల తరువాత ఇంకో ట్రైలర్ కూడా విడుదల చెయ్యడానికి రెడీ గా పెట్టుకున్నారు అని ఒక టాక్ వినిపిస్తోంది.

Latest News
 
'అమరన్' ట్రైలర్ అవుట్ Wed, Oct 23, 2024, 08:30 PM
ధనుష్, ఐశ్వర్య షాకింగ్ నిర్ణయం Wed, Oct 23, 2024, 07:42 PM
వార్ 2: హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ పరిచయ సన్నివేశాల గురించి ఆసక్తికరమైన బజ్ Wed, Oct 23, 2024, 07:36 PM
గజిని-2పై అల్లు అరవింద్ ఫోకస్! Wed, Oct 23, 2024, 07:34 PM
'క' ట్రైలర్ విడుదలకి టైమ్ లాక్ Wed, Oct 23, 2024, 07:31 PM