'రత్నం' ఫస్ట్ షాట్ కి భారీ స్పందన

by సూర్య | Mon, Dec 04, 2023, 07:39 PM

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌ యొక్క 34వ సినిమా రత్నం 'ఫస్ట్ షాట్' విడుదలైంది. భరణి, పూజ తర్వాత మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ల స్పెషలిస్ట్ హరితో విశాల్ నటిస్తున్న మూడవ సినిమా ఇది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రత్నం యొక్క ఫస్ట్  షాట్ అందరిని బాగా ఆకట్టుకుంటుంది.


తాజా అప్డేట్ ప్రకారం, ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ ఫస్ట్ షాట్ 4మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో టాప్ ట్రేండింగ్ లో ఉంది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరి కొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.

ఈ సినిమాలో విశాల్ కి జోడిగా ప్రియా భవానీ శంకర్ నటిస్తుంది. ప్రముఖ తమిళ నటుడు-చిత్ర నిర్మాతలు సముద్రఖని మరియు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కార్తెకేన్ సంతానం, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Latest News
 
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM