అందాల షోతో మైమరిపిస్తున్న కృతీ శెట్టి

by సూర్య | Mon, Dec 04, 2023, 11:19 AM

టాలీవుడ్ లోకి ఉప్పెనలా వచ్చి.. చప్పున చల్లారిపోయింది కన్నడ భామ కృతీ శెట్టి.  ప్రస్తుతం సోషల్ మీడియాలో తన వంతు ప్రయత్నాలు తాను చేస్తోంది. అందాలు ప్రదర్శనకు సై అంటోంది.. రోజు రోజుకు డోస్ పెంచుతోంది. తొలి చిత్రంతో సంచలన విజయాన్ని అందుకుంది కృతి శెట్టి . ఉప్పెన  సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీపై ఉప్పెనలా దాడి చేసింది. వరుస అవకాశాలు పొందింది. కాని అంతోనే ఆమెను వరుస ప్లాప్ లు చుట్టు ముట్టడంతో.. అవకాశాలు లేక ఇబ్బందిపడుతోంది బేబమ్మ. టాలీవుడ్‌ బేబమ్మగా గుర్తింపు తెచ్చుకున్న కృతి శెట్టి.. చాలా వరకు హద్దుల్లోనే ఉంది. సినిమాల్లోనూ గ్లామర్‌ షో చేయలేదు. కానీ లిప్ లాక్ లతో అదరగొట్టింది. ఇక అవకాశాలు తగ్గడంతో .. సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది.  నెమ్మదిగా తనలోని  హాట్‌ యాంగిల్‌ని ఆవిష్కరిస్తుంది. ఎంట్రీతోనే వరుస హిట్లతో దుమ్ములేపించింది. లక్కీ హీరోయిన్ గా కొన్నాళ్ల పాట తెలుగు పరిశ్రమలో వెలుగొందింది. "ఉప్పెన’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ సినిమాతో మొదటి హ్యాట్రిక్ అందుకుంది. కానీ ఆవెంటనే  కృతీ శెట్టి.. వరుస పరాజయాలతో హ్యాట్రిక్ డిజాస్టర్లు కూడా చూసింది. నాగచైతన్యతో ``కస్టడీ`, నితిన్‌తో `మాచర్ల నియోజకవర్గం`, రామ్‌తో `ది వారియర్స్`, సుధీర్‌బాబుతో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` వంటి సినిమాలు చేసింది. ఇవన్నీ బోల్తా కొట్టాయి.  దాంతో కృతీకి అవకాశాలు తగ్గాయి. ఇప్పుడు అసలు చేతిలో ఆఫర్లు లేవు. దీంతో తమిళం, మలయాళంపై ఫోకస్‌ పెట్టింది. అక్కడ ఒకటి అర ఆఫర్లు సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఇటీవల మరోతెలుగు మూవీకి ఓకే చెప్పింది. శర్వానంద్‌ 35 మూవీలో హీరోయిన్‌గా ఎంపికైంది. దీనికి శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. 


 

Latest News
 
తమిళ నటుడు, రాజకీయ నాయకుడు అరుల్మణి కనుమూత Fri, Apr 12, 2024, 10:10 PM
2.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'లక్కీ బాస్కర్' టీజర్ Fri, Apr 12, 2024, 08:36 PM
'వేట్టైయాన్‌' లో తన పాత్ర గురించి ఆసక్తికరమైన అప్డేట్ ని వెల్లడించిన ఫహద్ ఫాసిల్ Fri, Apr 12, 2024, 08:32 PM
రీ-రిలీజ్ కి సిద్ధంగా ఉన్న 'సై' Fri, Apr 12, 2024, 08:30 PM
నిహారిక కొణిదెల తొలి చలనచిత్రానికి క్రేజీ టైటిల్ ఖరారు Fri, Apr 12, 2024, 08:28 PM