తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని వెల్లడించిన నాని

by సూర్య | Sun, Dec 03, 2023, 05:10 PM

నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని తన 30వ చిత్రాన్ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'హాయ్ నాన్నా' అనే టైటిల్‌ను మూవీ మేకర్స్ ఖరారు చేసారు. ఈ సినిమా డిసెంబర్ 7, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది.


తాజాగా ఇప్పుడు నాని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భవిష్యత్తులో మరిన్ని మాస్ సినిమాలు చేస్తానని పేర్కొన్నాడు. ప్రతి సినిమా ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటానని నాని అన్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన సరిపోద శనివారం చిత్రం కూడా విడుదలకి సిద్ధంగా ఉంది.

సీతా రామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో నానికి జోడిగా నటిస్తుంది. ఈ పాన్-ఇండియన్ చిత్రంలో బేబీ కియారా, జయరామ్, ప్రియదర్శి, శ్రుతి హాసన్ మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. ప్రముఖ మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల మరియు మూర్తి KS ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
అక్కడ అసభ్యంగా తాకాడంటూ అనితా హస్సానందని ఎమోషనల్ ! Fri, Sep 20, 2024, 08:29 PM
లండన్ వెకేషన్ లో రవీనా టాండన్ Fri, Sep 20, 2024, 08:15 PM
ఆఫీసియల్ : 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Fri, Sep 20, 2024, 08:10 PM
'ది గోట్' నుండి చిన్న చిన్న కనగల్ వీడియో సాంగ్ రిలీజ్ Fri, Sep 20, 2024, 08:07 PM
'తంగలన్' లోని మనకి మనకి సాంగ్ కి భారీ రెస్పాన్స్ Fri, Sep 20, 2024, 08:03 PM