'ఈగల్' ఆడియో హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ మ్యూజిక్ లేబుల్

by సూర్య | Sun, Dec 03, 2023, 04:48 PM

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ సినిమాటోగ్రాఫర్ నుండి దర్శకుడిగా మారిన కార్తీక్ ఘట్టమ్నేనితో తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్ థ్రిల్లర్ కి 'ఈగిల్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా వీడియో గ్లింప్స్‌కి అభిమానులు మరియు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈగల్ ఆడియో హక్కులను మ్యూజిక్ లేబుల్ ఐకాన్ మ్యూజిక్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ పోస్టర్‌ని విడుదల చేసారు. ఈ చిత్రం 13 జనవరి 2024న విడుదల కానుంది.

థ్రిల్లర్‌ ట్రాక్ లో రానున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తుంది.

Latest News
 
అక్కడ అసభ్యంగా తాకాడంటూ అనితా హస్సానందని ఎమోషనల్ ! Fri, Sep 20, 2024, 08:29 PM
లండన్ వెకేషన్ లో రవీనా టాండన్ Fri, Sep 20, 2024, 08:15 PM
ఆఫీసియల్ : 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Fri, Sep 20, 2024, 08:10 PM
'ది గోట్' నుండి చిన్న చిన్న కనగల్ వీడియో సాంగ్ రిలీజ్ Fri, Sep 20, 2024, 08:07 PM
'తంగలన్' లోని మనకి మనకి సాంగ్ కి భారీ రెస్పాన్స్ Fri, Sep 20, 2024, 08:03 PM