'సాలార్' షూటింగ్ డేస్ గురించి సాలిడ్ అప్డేట్ ని వెల్లడించిన ప్రశాంత్ నీల్

by సూర్య | Sun, Dec 03, 2023, 02:31 PM

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'సాలార్' సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రంపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదల కావాల్సి ఉండగా వివిధ కారణాల వల్ల డిసెంబర్ 22కి వాయిదా పడింది. తాజాగా ఇప్పుడు, సాలార్ షూటింగ్ 114 రోజుల పాటు సాగిందని ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులకే ఎక్కువ సమయం పడినట్లు ఎక్కువ భాగం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిందని నీల్ వెల్లడించాడు. సింగరేణి గనులు, వైజాగ్, మంగళూరు ఓడరేవుల్లో కొన్ని భాగాలను మూవీ మేకర్స్ చిత్రీకరించారు.

యాక్షన్ థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుంది. ఈ సినిమాలో గోపీ, జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు, పొగరు ఫేమ్ శ్రీయా రెడ్డి, బ్రహ్మాజీ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ పాన్ ఇండియా సినిమా డిసెంబర్ 22న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM