'సత్యభామ' కి డబ్బింగ్ చెప్పనున్న కాజల్ అగర్వాల్

by సూర్య | Sun, Dec 03, 2023, 02:27 PM

భగవంత్ కేసరి సినిమాతో కాజల్ మళ్లీ సినీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా హిట్ కావడంతో కాజల్‌కి కొత్త ఊపు వచ్చింది. తాజాగా ఇప్పుడు నటి తన కొత్త సినిమా 'సత్యభామ' అనే పోలీసు డ్రామాతో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ACP పాత్రను పోషించింది. అయితే ఈ సినిమాలో కాజల్ తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోనుందని సమాచారం. అఖిల్ డేగల దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఔరం ఆర్ట్స్ బ్యానర్‌పై బాబీ తిక్క, శ్రీనివాస్ రావు తక్కలపెల్లి నిర్మించారు. ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క స్క్రీన్ రైటర్ గా ఉండగా, శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చారు.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM