పిచ్చెక్కిస్తున్న మాళవికా మోహనన్

by సూర్య | Sun, Dec 03, 2023, 08:52 AM

‘మాస్టర్’ హీరోయిన్ మాళవిక మోహనన్ అందాల వరదలో నెటిజన్లను ముంచేస్తోంది. చీరకట్టులో పద్ధతిగానే దర్శనమిచ్చినా.. గ్లామర్ విందుతో మత్తెక్కిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోస్ చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమనే చెప్పాలి.మలయాళీ ముద్దుగుమ్మ మాళవికా మోహనన్  హీరోయిన్ గా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. ఇప్పటికే తమిళంలో ‘పేట’, ‘మాస్టర్’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ప్రస్తుతం తమిళం, మలయాళంతో పాటు హిందీలోనూ అవకాశాలు అందుకుంటోంది. బాలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న ‘యుద్ర’ అనే చిత్రంలో ఈ ముద్దుగుమ్మ కీలక పాత్రలో నటిస్తోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ రానున్నాయి. ఇదిలా ఉంటే.. మాళవికా సోషల్ మీడియాలో తరుచూగా తన అందమైన ఫొటోలను పంచుకుంటూ మైమరిపిస్తోంది. అందాల ప్రదర్శన చేసేలా అవుట్ ఫిట్లు ధరిస్తూ అదరగొడుతోంది. గ్లామర్ షోలో రోజుకోతీరు మెరుస్తూ మతులు చెడగొడుతోంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ ట్రాన్స్ ఫరెంట్ శారీలో దర్శనమిచ్చింది. జాలీలాంటి చీరలో నడుము, నాభీ అందాలను చూపిస్తూ చూపు తిప్పుకోకుండా చేసింది. కొంగు పక్కకు జరిపి బిగుతైన బ్లౌజ్ లో అందాలను చూపిస్తూ మంత్రముగ్ధులను చేసింది. విరహ వేదనతో ఈ బ్యూటీ ఇచ్చిన ఫోజులకు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మాళవికా అందాల ధాటికి ఫిదా అవుతున్నారు. చీరకట్టులో మాళవిక మైండ్ బ్లోయింగ్ ఫోజులకు చూపు తిప్పుకోలేకపోతున్నారు. లైక్స్, కామెంట్లతో ఆ ఫొటోలను నెట్టింట వైరల్ గా మారుస్తున్నారు. 


 





Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM