దిల్‌ రాజు ఇంట పెళ్లి సందడి

by సూర్య | Fri, Dec 01, 2023, 05:03 PM

నిర్మాత దిల్‌ రాజు  ఇంట త్వరలోనే పెళ్లిబాజాలు మోగనున్నాయి. ఆయన సోదరుడు, నిర్మాత శిరీష్‌ తనయుడు హీరో ఆశిష్‌ రెడ్డి ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఆంధ్రప్రదేశకు చెందిన అద్విత రెడ్డి అనే అమ్మాయిని ఆయన వివాహం చేసుకోనున్నారు. గురువారం వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. ఇరు కుటుంబాలు, కొద్దిమంది అతిథులు ఈ వేడుకకు హాజరై సందడి చేశారు.అద్విత తండ్రి వ్యాపారవేత్త అని తెలుస్తోంది. వీరిద్దరి వివాహాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్లాన్‌ చేశారని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. ఆశిష్‌ ‘రౌడీబాయ్స్‌’ సినిమాతో హీరోగా టాలీవుడ్‌కి పరిచయం అయ్యాడు. ప్రస్తుతం మరో రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు. విశాల్‌ కాశీ దర్శకత్వంలో నటిస్తున్న ‘సెల్ఫిష్‌’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ‘లవ్‌టుడే’ ఫేమ్‌ ఇవానా కథానాయికగా కనిపించనుంది.

Latest News
 
నేషనల్ వైడ్ ట్రెండింగ్ లో 'మజాకా' ఫస్ట్ లుక్ Mon, Sep 23, 2024, 04:48 PM
క్రైమ్ థ్రిల్లర్‌లో విలన్‌గా మమ్ముట్టి Mon, Sep 23, 2024, 04:43 PM
100 కోట్ల మార్క్ దిశగా 'ARM' Mon, Sep 23, 2024, 04:36 PM
'ది గోట్' నుండి మట్ట వీడియో సాంగ్ రిలీజ్ Mon, Sep 23, 2024, 04:33 PM
ఇంస్టాగ్రామ్ లో 300K+ రీల్స్ ని నమోదు చేసిన 'వెట్టయన్' ఫస్ట్ సింగిల్ Mon, Sep 23, 2024, 04:26 PM