వైరల్ అవుతున్న మాళవిక మోహనన్ పోస్ట్

by సూర్య | Fri, Dec 01, 2023, 05:03 PM

మాళవిక మోహనన్ సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. తీరిక దొరికిన ప్రతిసారీ అభిమానులతో ముచ్చటిస్తుంటారు. తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్‌లను ఇస్తుంటారు. ప్రస్తుతం ఆమె విక్రమ్‌ హీరోగా రూపొందుతోన్న ‘తంగలాన్‌’లో నటిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన టీజర్‌లో మాళవిక తన లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి అప్‌డేట్‌ను ఇస్తూ మాళవిక చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. "వైవిధ్యమైన కథతో రూపొందుతున్న సినిమా ఇది. చిత్రీకరణ పూర్తయింది. ఇటీవల డబ్బింగ్‌ పనులు మొదలయ్యాయి. సినిమా మేకింగ్‌లో నాకు అన్నిటికంటే కష్టమైన పని డబ్బింగ్‌ చెప్పడం. నేను ఈ సినిమాకు డబ్బింగ్‌ చెప్పేటప్పడు ఎవరైనా వచ్చి నాచేయి పట్టుకుని ధైర్యానిస్తారా?’’ అంటూ సరదాగా పోస్ట్‌ పెట్టారు. ఇలాంటి పోస్ట్‌ పెడితే నెటిజన్లు ఊరుకుంటారా? 'నేను రెడీ అంటే నేను రెడీ.. డబ్బింగ్‌ థియేటర్‌లో నీ పక్కనే కూర్చుని ధైర్యం చెబుతా' అంటూ ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు. ‘తంగలాన్‌' చిత్రం పా.రంజిత్‌ దర్శకత్వంలో రూపొందుతోంది. కర్ణాటక, కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌లోని కార్మికుల జీవితాల చుట్టూ జరిగే వాస్తవిక ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కుతున్నారు. ఇందులో విక్రమ్‌ ఓ తండాకు చెందిన వ్యక్తిగా కనిపించనున్నారు. భారతీయ, విదేశీ భాషల్లో 2డీ, 3డీలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 2024 జనవరి 26న ప్రేక్షకుల ముందుకొస్తుందీ సినిమా.

Latest News
 
'సత్యం సుందరం' ట్రైలర్ రిలీజ్ Mon, Sep 23, 2024, 06:51 PM
2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ సింగల్ Mon, Sep 23, 2024, 06:46 PM
'మత్తు వదలారా 2' నుండి మొరాన్ సాంగ్ అవుట్ Mon, Sep 23, 2024, 05:30 PM
VD12: మేజర్ షూటింగ్ పూర్తి చేసుకున్న విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్ Mon, Sep 23, 2024, 05:24 PM
గుజరాత్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఎల్2 ఎంపురాన్ Mon, Sep 23, 2024, 05:20 PM