ప్రశాంత్ నీల్ - 'సాలార్ 2' ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేను

by సూర్య | Wed, Nov 29, 2023, 02:52 PM

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'సాలార్' సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. సాలార్ నిర్మాతలు ఈ చిత్రానికి రెండు భాగాలను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మొదటి భాగం సలార్: సీజ్ ఫైర్ పార్ట్1. పార్ట్ 2 షూటింగ్ ఎప్పుడు అని దర్శకుడిని అడిగినప్పుడు, అది లాజిస్టికల్ విషయమని చెప్పాడు. సాలార్ 2 ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందో తాను చెప్పలేనని నీల్ చెప్పాడు. సాలార్ తర్వాత ప్రశాంత్ నీల్ కి జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా ఉంది. ఎన్టీఆర్‌తో ప్రాజెక్ట్ 2024 మార్చిలో ప్రారంభమవుతుంది.

యాక్షన్ థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుంది. ఈ సినిమాలో గోపీ, జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు, పొగరు ఫేమ్ శ్రీయా రెడ్డి, బ్రహ్మాజీ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ పాన్ ఇండియా సినిమా డిసెంబర్ 22న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM