'ఫ్యామిలీ స్టార్‌' లో జాతీయ అవార్డు గెలుచుకున్న నటి కీలక పాత్ర

by సూర్య | Tue, Nov 28, 2023, 05:18 PM

పరశురామ్ పెట్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక ప్రాజెక్ట్ ని చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమాకి "ఫ్యామిలీ స్టార్" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా నోయిడాలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.


సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం మరియు చిత్రలహరి చిత్రాలలో తన పాత్రలకు పేరుగాంచిన జాతీయ అవార్డు గెలుచుకున్న నటి రోహిణి హట్టంగడి ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటి రష్మిక మందన్న, జగపతి బాబు కీలక పాత్రలలో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపి సుందర్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM