పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన రష్మిక 'ది గర్ల్‌ఫ్రెండ్'

by సూర్య | Tue, Nov 28, 2023, 05:23 PM

కన్నడ స్టార్ బ్యూటీ రష్మిక మందన్న వివిధ ప్రాజెక్ట్స్‌తో పాటు యానిమల్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. తాజాగా నేషనల్ క్రష్ ఇప్పుడు జాతీయ అవార్డు గ్రహీత రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో గర్ల్ ఫ్రెండ్ అనే కొత్త చిత్రానికి సైన్ చేసింది. అక్టోబర్‌లో ప్రకటించబడిన ఈ చిత్రం ఈరోజు హైదరాబాద్‌లో అధికారికంగా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, SKN, దర్శకులు సాయి రాజేష్, మారుతి, పవన్ సాదినేని మరియు ఇతర ప్రముఖులు ఈ ఈవెంట్ కి హాజరుఅయ్యారు. అల్లు అరవింద్ క్లాప్‌బోర్డ్‌తో షూట్‌ని ప్రారంభించి, స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందజేశారు.


ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. అల్లు అరవింద్ సమర్పణలో మాస్ మూవీ మేకర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందించారు.

Latest News
 
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM
'సింగం ఎగైన్' లో బాలీవుడ్ సూపర్‌స్టార్ Thu, Sep 19, 2024, 07:19 PM