ఆలియా ఆనంద‌హేళ‌

by సూర్య | Thu, Mar 14, 2019, 10:33 PM

ఒక భారీ చిత్రంలో అవకాశం హీరోయిన్ల కెరీర్‌నే మార్చేయగలదు. బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్‌ RRR మూవీ ఆఫర్‌తో తెగ మురిసిపోతోంది. రాజమౌళి తాజా చిత్రం  ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ చిత్రంలో రామ్‌చరణ్‌కు జోడీగా నటించబోతున్న ఆలియా ఇవాళ తనకు పండుగరోజు అంటోంది. ..! ఈ సినిమాతోనే ఆలియా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుండడం కాకతాళీయం.తనకు సినిమాలో అవకాశం ఇచ్చినందుకు ఆలియా ట్విటర్‌ వేదికగా రాజమౌళికి ధన్యవాదాలు తెలిపారు. ‘ఈరోజు నేను చాలా గొప్పగా ఫీలవుతున్నాను. అద్భుతమైన నటులతో, మిగతా బృందంతో కలిసి అందమైన ప్రయాణాన్ని ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తానా? అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ఈ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ రాజమౌళి సర్‌..’ అని పేర్కొన్నారు ఆలియా. రాజమౌళి మూవీలో ఆలియా భట్‌కు అవకాశం వచ్చిందని, ఆమె తిరస్కరించిందని అనేక పుకార్లు షికార్లు చేశాయి. ఈరోజు రాజమౌళి ప్రెస్‌మీట్‌లో ఆలియా ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’లో నటిస్తోందని చెప్పడంలో అభిమానుల్లో ఉన్న సందేహాలన్నీ ఎగిరిపోయాయి. ఆలియా ట్వీట్‌కు రాజమౌళి సమాధానమిస్తూ.. ‘తోటి నటులతో పోటీపడటానికి అంచనాలు పెంచేస్తూ ఎంతో కష్టపడతావని విన్నాను. ఇప్పుడు నా సినిమాలో నువ్వు అదే నిబద్ధతను చూపించబోతున్నందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను’ అని పేర్కొన్నారు. మొత్తం మీద ఆలియా ట్వీట్, రాజమౌళి రిట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. 

Latest News
 
'దేవకీ నందన వాసుదేవ' ఫస్ట్ సింగల్ అవుట్ Fri, May 03, 2024, 08:55 PM
బుక్ మై షో ట్రేండింగ్ లో 'ఆ ఒక్కటి అడక్కు' Fri, May 03, 2024, 08:53 PM
'కన్నప్ప' షూటింగ్ ని పూర్తి చేసుకున్న అక్షయ్ కుమార్ Fri, May 03, 2024, 08:51 PM
'ఇండియన్ 2' ఆడియో లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో Fri, May 03, 2024, 08:49 PM
'ఓ మంచి ఘోస్ట్' నుండి కాన్సెప్ట్ పోస్టర్ మరియు గ్లింప్స్ విడుదల Fri, May 03, 2024, 06:26 PM