పెళ్లి పీటలు ఎక్కబోతున్న మలైకా‌,అర్జున్ కపూర్‌

by సూర్య | Thu, Mar 14, 2019, 10:37 PM

నటి మలైకా అరోరా నటుడు అర్జున్ కపూర్‌ల వ్యవహారం హాట్ టాపిక్ అవుతూనే వుంది. వీరి గురించి జనం చెవులు కొరుక్కుంటున్నారు. తనకంటే 12 ఏళ్లు పెద్దది అయిన మలైకా‌తో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అర్జున్. ఈ నేపథ్యంలో మలైకా తన మనసులో మాటను బయటపెట్టింది. తాను అర్జున్ కపూర్‌ని పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి సంచలనం రేపారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఎంతమంది లవర్స్ ఉన్నా.. ఎంత మంది సీక్రెట్ లవ్ ఎఫైర్ కొనసాగిస్తున్నా.. అందరి దృష్టి మాత్రం మలైకా-అర్జున్ ఎఫైర్ మీదే పడుతోంది. ముఖ్యంగా అర్జున్ కపూర్, మలైకాలు ఎక్కడ కనిపించినా ఆ విజువల్స్ మాత్రం వదలటం లేదు. ఎక్కడికి వెళ్లినా అర్జున్ ఆమె చేతిలో చేయి వేసి మరీ తీసుకెళుతున్నాడు. త్వరలో వీరి పెళ్ళి జరగబోతోంది. అయితే హంగు ఆర్బాటం లేకుండా సింపుల్‌గా పెళ్ళి చేసుకోవాలని భావిస్తున్నారని టాక్.  ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి.  ఏప్రిల్‌లో పెళ్లికి సన్నాహాలు చేస్తున్నాడు అర్జున్. పెళ్ళి అనంతరం వీరిద్దరూ కలిసి ఉండేందుకు ముంబయిలోని లొఖండవాలాలో అపార్ట్ మెంట్ కూడా కొనేశాడని టాక్. పెళ్లి చేసుకుని భర్తకు విడాకులిచ్చి .. పాపం అర్జున్‌ను వలలో వేసుకున్న మలైకా అతడిని పెళ్లి చేసుకుని సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటుంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. బాబాయ్ అనిల్ కపూర్ కూడా వీరిద్దరి రిలేషన్ షిప్, పెళ్ళి వార్తలపై నో కామెంట్ అంటున్నారు. 


 


 

Latest News
 
'సింగం ఎగైన్' మాస్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ Sat, Apr 20, 2024, 07:25 PM
'బ్రహ్మాస్త్ర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Apr 20, 2024, 07:23 PM
ఆదిత్య హాసన్ తదుపరి చిత్రానికి టైటిల్ లాక్ Sat, Apr 20, 2024, 07:21 PM
'మనమే' టీజర్ కి భారీ స్పందన Sat, Apr 20, 2024, 07:10 PM
OTTలో ప్రసారానికి అందుబాటులోకి వచ్చిన తమిళ మిస్టరీ థ్రిల్లర్ 'రణం' Sat, Apr 20, 2024, 07:08 PM