మాధురీ దీక్షిత్ ఫ్యాన్స్ ఆనందం

by సూర్య | Tue, Nov 21, 2023, 12:37 PM

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మాధురి దీక్షిత్ కి అరుదైన గౌరవం దక్కింది. గోవా వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2023 వేదికపై ఆమెకు అవార్డు ప్రదానం చేశారు. బాలీవుడ్ ప్రముఖ నటి మాధురీ దీక్షిత్ సేవలను భారత ప్రభుత్వం గుర్తించింది. దశాబ్దాలుగా తన నటనతో వినోదం పంచిన ఆమెకు ప్రత్యేక గౌరవం ఇచ్చింది. గోవా వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేదికగా 'స్పెషల్ రికగ్నిషన్ ఫర్ కాంట్రిబ్యూషన్ టు భారతీయ సినిమా' అవార్డుతో సత్కరించారు. ఈ విషయాన్ని యూనియన్ స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. సాటి లేని ప్రతిభతో దశాబ్దాలు పాటు విలక్షణ పాత్రలతో భారతీయ సినిమాకు సేవలు అందించిన మాధురీ దీక్షిత్ ని స్పెషల్ రికగ్నిషన్ ఫర్ కాంట్రిబ్యూషన్ తో భారతీయ సినిమా అవార్డుతో సత్కరించుకోవడం జరిగిందని... ఆయన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. మాధురీ దీక్షిత్ కి దక్కిన ఈ ట్రిబ్యూట్ కి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 


నవంబర్ 20న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా మొదలైంది. 9 రోజుల పాటు గోవా లోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో ఈ సినిమా పండగ జరగనుంది. విజయ్ సేతుపతి, సారా అలీ ఖాన్, శ్రేయా ఘోషల్, సుఖ్వీందర్ సింగ్, కరణ్ జోహార్, సన్నీ డియోల్, పంకజ్ త్రిపాఠితో పాటు పలువురు ప్రముఖులు అతిథులుగా హాజరుకానున్నారు . 

Latest News
 
USAలో $200K మార్క్ ని చేరుకున్న 'మహారాజా' Mon, Jun 17, 2024, 10:28 PM
5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'కల్కి 2898 AD' లోని భైరవ ఎంతమ్ సాంగ్ Mon, Jun 17, 2024, 10:25 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'బాయ్స్ హాస్టల్' Mon, Jun 17, 2024, 10:23 PM
YT మ్యూజిక్ ట్రేండింగ్ లో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' లోని మాట్టాడకుండా వీడియో సాంగ్ Mon, Jun 17, 2024, 10:21 PM
'భలే ఉన్నాడే' లోని సెకండ్ సింగల్ లిరికల్ షీట్ అవుట్ Mon, Jun 17, 2024, 10:19 PM