![]() |
![]() |
by సూర్య | Tue, Nov 21, 2023, 11:43 AM
ప్రణితా సుభాష్.. పెళ్లి తర్వాత జోరు మరింతగా పెంచింది. ఆమె గ్లామర్ సైడ్ ఓపెన్ అవుతుంది. బౌండరీలు బ్రేక్ చేస్తూ నెట్టింట అగ్గి రాజేస్తుంది. నయా ఔట్ ఫిట్‌లో క్రేజీ పిక్స్ షేర్ చేసుకుంది.పవన్ కళ్యాణ్‌తో `అత్తారింటికి దారేదీ` చిత్రంలో నటించి పాపుల్ అయ్యింది ప్రణితా సుభాష్. అలాగే ఎన్టీఆర్‌తో `రభస` చిత్రంలోనూ మెరిసింది. టాప్ స్టార్స్ కి జోడీ కట్టిన ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్‌గా మాత్రం రాణించలేకపోయింది. ప్రణిత తెలుగులో నటించింది చాలా తక్కువ సినిమాలే. అందులో ఒకటి రెండు మూవీస్ మాత్రమే ఆదరణ పొందాయి. పైగా ఈ అమ్మడు మెయిన్ హీరోయిన్‌గా కూడా నటించింది చాలా తక్కువ. దీంతో తెలుగు ఆడియెన్స్ కి ఈ బ్యూటీ అంతంత మాత్రంగానే తెలుసు అని చెప్పొచ్చు. అయితే సోషల్ మీడియాతో ఈ బ్యూటీ మరింతగా దగ్గరయ్యింది. ఆమె పెళ్లి వరకు ప్రణీతని పెద్దగా పట్టించుకుంది లేదు. ఆ తర్వాత ఈ బ్యూటీని ఎక్కువగా ఆదరణ దక్కుతుందని చెప్పొచ్చు. సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ప్రణీత సుభాష్ ఆ వెంటనే పండంటి ఆడబిడ్డకి కూడా జన్మనిచ్చింది. అమ్మగా మారి ఇప్పుడు ఓ వైపు తన కూతురుని చూసుకుంటుంది. మరోవైపు సినిమాలు చేస్తుంది. దానికి మించి సోషల్ మీడియాలో బిజీ అవుతుంది. గతంలో కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారింది. గ్లామర్ డోస్ కూడా పెంచింది. చాలా వరకు హీరోయిన్లు పెళ్లికి ముందు స్లిమ్‌గా, సన్నగా ఉంటూ ఎంతో అందంగా, క్యూట్‌గా ఉండేవారు. కానీ పెళ్లి తర్వాత మాత్రం, ముఖ్యంగా తల్లి అయ్యాక హాట్‌గా, సెక్సీగా మారుతున్నారు. ప్రణీతా సుభాష్ సైతం అలానే కనిపిస్తుంది. తల్లి అయ్యాక ఆమెలోని హాట్ యాంగిల్ మరింత ఓపెన్ అయ్యిందని చెప్పాలి. అసలైన హాట్ నెస్ ఇప్పుడే బయటకొచ్చిందనేలా ఉంటుంది. అంతేకాదు అందాల విందులోనూ తెగిస్తుంది. గ్లామర్ డోస్ పెంచుతూ మత్తెక్కిస్తుంది. సెక్సీ అందాలతో కుర్రాళ్లని టెంప్ట్ చేస్తుంది. నిత్యం ఎంగేజ్ చేస్తుంది. ఇప్పుడు కూడా అదే చేసిందీ సెక్సీ మదర్.
Latest News