'సైంధవ్' మొదటి సింగిల్ గురించిన లేటెస్ట్ అప్డేట్

by సూర్య | Mon, Nov 20, 2023, 08:48 PM

శైలేష్ కొలను దర్శకత్వంలో టాలీవుడ్ హీరో వెంకటేష్ తన 75వ సినిమాని అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'సైంధవ్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. సంతోష్ నారాయణన్ కంపోజ్ చేసిన ఈ సినిమాలోని మొదటి సింగిల్ రాంగ్ యూసేజ్ పెప్పీ నంబర్ రేపు విడుదల కానుంది. తాజాగా ఇప్పుడు సైంధవ్ చిత్ర బృందం రేపు మధ్యాహ్నం 2 గంటలకు మరియు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని CMR ఇంజనీరింగ్ కళాశాల మరియు VNR VJIET కళాశాల రెండు ప్రదేశాలలో ఈ సాంగ్ ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.


యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్నఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తుంది. ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ లో బేబీ సారా, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిక్, రుహాని శర్మ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జనవరి 13, 2024న థియేటర్‌లలో విడుదల కానుంది. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియన్ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
మరోసారి చిక్కుల్లో పడ్డ నటుడు టామ్ చాకో Thu, Apr 17, 2025, 07:04 PM
రేపే 'థగ్ లైఫ్' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Apr 17, 2025, 06:54 PM
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ఈ తేదీన విడుదల కానుందా? Thu, Apr 17, 2025, 06:50 PM
'సారంగపాణి జాతకం' ట్రైలర్ కి సాలిడ్ రెస్పాన్స్ Thu, Apr 17, 2025, 06:42 PM
'ఎల్ 2: ఎంప్యూరాన్' డిజిటల్ ఎంట్రీకి తేదీ ఖరారు Thu, Apr 17, 2025, 06:38 PM