'యానిమల్' ట్రైలర్ విడుదలకి తేదీ లాక్

by సూర్య | Mon, Nov 20, 2023, 08:51 PM

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్‌తో సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాకి 'యానిమల్' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక రణబీర్‌తో రొమాన్స్ చేయనుంది. తాజాగా చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన సోషల్ మీడియా ప్రొఫైల్ లో నవంబర్ 23, 2023న యానిమల్ ట్రైలర్‌ను ఆవిష్కరించనున్నట్టు వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు రణబీర్‌తో కలిసి ఉన్న మోనోక్రోమ్ చిత్రాన్ని డైరెక్టర్ షేర్ చేశాడు.

యానిమల్ డిసెంబర్ 1, 2023న హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల కానుంది. రణబీర్ కపూర్ ఈ సినిమాలో ఇంటెన్సివ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ అండ్ సినీ1 స్టూడియోస్ నిర్మిస్తున్నాయి.

Latest News
 
హర్రర్ థ్రిల్లర్ '12A రైల్వే కాలనీ' ని ప్రకటించిన అల్లరి నరేష్ Mon, Mar 17, 2025, 10:00 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఫస్ట్ సింగల్ ప్రోమో అవుట్ Mon, Mar 17, 2025, 09:55 PM
ఆఫీసియల్: 'బ్రహ్మ ఆనందం' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Mon, Mar 17, 2025, 09:50 PM
'కింగ్డమ్' టీజర్ OST రిలీజ్ Mon, Mar 17, 2025, 06:24 PM
ఎంప్యూరాన్ FDFS టైమింగ్స్ లాక్ Mon, Mar 17, 2025, 06:19 PM