అల్లూరి సీతారామరాజుకు కూడా మరదలు ఉంది: రాజమౌళి

by సూర్య | Thu, Mar 14, 2019, 02:01 PM

'ఆర్ఆర్ఆర్' సినిమాపై మీడియా సమావేశం తరువాత, పాత్రికేయులు అడిగిన ఓ ఆసక్తికరమైన ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇచ్చారు. ఓ పాత్రికేయుడు, కొమరం భీమ్, అల్లూరి బ్రహ్మచారులు కదా?... మీరేమో హీరోయిన్లను పెట్టారు. పాటలు, రొమాన్స్ ఎలా? అని ప్రశ్నించగా, రాజమౌళి స్పందించారు. చరిత్రలో కొమరం భీమ్ కు ఇద్దరు భార్యలు ఉన్నారని గుర్తు చేశారు. అల్లూరి రామరాజు సైతం తాను సీతారామరాజుగా మారకముందు మరదలితో రొమాన్స్ చేశారని అన్నారు. ఇది ఫిక్షనల్ చిత్రమని, నిజ జీవిత క్యారెక్టర్ల ఆధారంగా నడుస్తుందని అన్నారు. గత శతాబ్ధం తొలినాళ్లలో తెలంగాణ వీరుడు, ఆంధ్రా వీరుడు కలిస్తే ఎలా ఉంటుందన్న ఊహాజనిత కథే ఇదని వెల్లడించారు.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM