సునీల్ ద‌ర్శ‌క‌త్వంలో సాయిధ‌ర‌మ్ తేజ్‌

by సూర్య | Wed, Mar 13, 2019, 10:07 PM

సునీల్ ఓ సినిమాకి ద‌ర్శ‌కుడిగా మారితే… అందులో సాయిధ‌ర‌మ్ తేజ్ క‌థానాయకుడిగా న‌టిస్తే ఎలా ఉంటుంది? ఆ కాంబినేష‌న్‌కి పిచ్చ క్రేజ్ వ‌చ్చేస్తుంది క‌దూ. అయితే.. ఇప్పుడేం ఇలాంటి అద్భుతాలు జ‌ర‌గ‌డం లేదు. కొన్నేళ్ల క్రితం అయితే సునీల్‌కి ఈ ఆలోచ‌న వ‌చ్చింద‌ట‌. ”సాయి అంటే నాకు చాలా ఇష్టం. త‌న‌ని చూస్తే ముచ్చ‌టేసేది. త‌న‌కోస‌మైనా నేను ద‌ర్శ‌కుడిగా మారిపోయి.. త‌న‌తో ఓ సినిమా చేయాల‌నిపించేది” అంటున్నాడు. ‘చిత్ర‌ల‌హ‌రి’లో వీరిద్ద‌రూ క‌ల‌సి న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఏప్రిల్ 12న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.
‘చిత్ర‌ల‌హ‌రి’ టీజ‌ర్ ఈరోజు హైద‌రాబాద్‌లో విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా సునీల్ త‌న చిన‌నాటి చిత్ర‌ల‌హ‌రి జ్ఞాప‌కాలు గుర్తు చేసుకున్నాడు. ”చిన్న‌ప్పుడు స్కూలు కెళ్ల‌కుండా సినిమాల‌కు వెళ్లిపోయేవాడ్ని. ప్ర‌తీరోజూ సాయింత్రం ట్యూష‌న్ కూడా ఎగ్గొట్టేసి ఇంగ్లీష్ సినిమాలు చూసేవాడ్ని. కానీ శుక్ర‌వారం మాత్రం ట్యూష‌న్‌కి వెళ్లేవాడ్ని. ఎందుకంటే ట్యూష‌న్ మాస్ట‌రి ఇంట్లో టీవీ ఉండేది. చిత్ర‌ల‌హ‌రి చూడ్డానికైనా వెళ్లాల్సివ‌చ్చేది. మంచం కింద దూరి చిత్ర‌ల‌హ‌రి చూస్తుంటే.. మాస్టారు నా కాళ్లు ప‌ట్టుకుని లాగేసేవాళ్లు” అంటూ చిత్ర‌ల‌హ‌రి రోజుల్ని గుర్తు చేసుకున్నాడు. ”నువ్వూ నేను స‌మ‌యం నుంచే సునీల్ అన్న‌కు పెద్ద ఫ్యాన్‌ని. త‌న‌తో క‌ల‌సి న‌టించాల‌ని చాలాసార్లు అనుకున్నా. ఇన్నాళ్ల‌కు కుదిరింది” అంటూ సాయిధ‌ర‌మ్ తేజ్ చెప్పాడు.

Latest News
 
'డార్లింగ్' లో తన భాగాన్ని పూర్తి చేసుకున్న నభా నటేష్ Tue, May 07, 2024, 04:31 PM
త్వరలో ఆహాలో మెరవనున్న 'విద్యా వాసుల అహం' Tue, May 07, 2024, 04:29 PM
'మైదాన్' డిజిటల్ ఎంట్రీపై లేటెస్ట్ బజ్ Tue, May 07, 2024, 04:27 PM
'పుష్ప' నా కోసం ఏమీ చేసిందని నేను అనుకోను - ఫహద్ ఫాసిల్ Tue, May 07, 2024, 04:05 PM
బజ్ : ఆర్యన్ ఖాన్ యొక్క 'స్టార్‌డమ్' డిజిటల్ రంగప్రవేశం అప్పుడేనా Tue, May 07, 2024, 04:02 PM