నేడు దేవానంద్‌ శత జయంతి

by సూర్య | Tue, Sep 26, 2023, 01:14 PM

భారతీయ చిత్ర పరిశ్రమ ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాల్సిన పేరు... దేవానంద్‌. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా దేవానంద్‌ కీర్తి చిరస్తాయిగా నిలిచిపోతుంది. ఆరు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణలో వంద చిత్రాల్లో మెరిసిన దేవానంద్‌ వెండితెరపై తనదైన ముద్ర వేశారు. దేవానంద్‌ స్టైల్‌కి అమ్మాయిలు అప్పట్లో ఫిదా. దేవానంద్‌ కనిపిస్తే చాలు.. కాసుల వర్షం కురిసేది. హీరోయిజానికీ, స్టార్‌డమ్‌కీ దేవానంద్‌ ఓ కేరాఫ్‌ అడ్రస్‌. ఈ ప్రయాణంలో ఆయన అందుకోని విజయాల్లేవు. ఆయన్ని వరించని అవార్డుల్లేవు. 2001లో కేంద్ర ప్రభుత్వం దేవానంద్‌ని పద్మభూషణ్‌తో సత్కరించింది. పస్తుతం బాలీవుడ్‌ దేవానంద్‌ వందేళ్ల పండగ జరుపుకొంటోంది. సెప్టెంబరు 26.. దేవానంద్‌ శత జయంతి. ఈ సందర్భంగా దేవానంద్‌ పాత సినిమాల్ని గుర్తు చేసుకొంటూ, ఆయన జీవితాన్ని, వైభవాన్ని స్మరించుకొంటోంది. దేవానంద్‌ 100 పేరిట శని, ఆదివారాలు ముంబైలో ఓ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ‘గైడ్‌’, ‘జానీ మేరా నామ్‌’, ‘సీఐడీ’ లాంటి సూపర్‌ డూపర్‌ హిట్‌ చిత్రాల్ని ప్రదర్శించారు. ఈ చిత్రాలన్నింటికీ అపూర్వ ఆదరణ లభించింది. దేవానంద్‌ వందేళ్ల వైభవాన్ని స్మరించుకొంటూ బాలీవుడ్‌ ఓ భారీ వేడుక నిర్వహించి, ఆ మహా నటుడికి నివాళి అర్పించాలనుకొంటోంది.

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM