OTT విడుదల తేదీని లాక్ చేసిన 'ఖుషి'

by సూర్య | Mon, Sep 25, 2023, 09:02 PM

శివ నిర్వాణ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ సేనాషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'ఖుషి' సినిమా సెప్టెంబర్ 1, 2023న తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషలలో అక్టోబర్ 1, 2023 నుండి స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ అధికారకంగా ప్రకటించింది.


విజయ్ దేవరకొండ సరసన గ్లామర్ బ్యూటీ సమంత రూత్ ప్రభు జంటగా నటించింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో సచిన్ ఖేడాకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హృదయం ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.

Latest News
 
'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' 13 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే...! Fri, Sep 20, 2024, 04:36 PM
'35-చిన్న కథ కాదు' నుండి సయ్యారే సయ్య వీడియో సాంగ్ అవుట్ Fri, Sep 20, 2024, 04:31 PM
2.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' ఫస్ట్ సింగల్ Fri, Sep 20, 2024, 04:27 PM
శ్రీలీల కి ‘ఐ లవ్ యూ’ అంటూ ప్రపోజ్... శ్రీలీల రియాక్షన్ ఏంటో తెలుసా ? Fri, Sep 20, 2024, 04:22 PM
'మత్తు వదలారా 2' తొలి వారం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే...! Fri, Sep 20, 2024, 04:21 PM