రామ్‌ కిరణ్‌, మేఘా ఆకాశ్‌ జంటగా క్రొత్త చిత్రం

by సూర్య | Mon, Sep 25, 2023, 04:41 PM

రామ్‌ కిరణ్‌, మేఘా ఆకాశ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘సఃకుటుంబనాం’. ఉదయ్‌ శర్మ దర్శకుడు. హెచ్‌.మహదేవ్‌ గౌడ, హెచ్‌.నాగరత్నం నిర్మాతలు. ఆదివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ఏ.ఎం.రత్నం క్లాప్‌ ఇచ్చారు. చిన్ని ప్రకాశ్‌ స్విచ్చాన్‌ చేశారు. ‘‘కథ వినగానే నిర్మాతకు బాగా నచ్చింది. వెంటనే ‘ఓకే’ అయిపోయింది. ఇదో క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. అన్ని వర్గాలకూ నచ్చేలా ఉంటుంద’’న్నారు దర్శకుడు. ‘‘ఈ చిత్రంలో నా పాత్ర పేరు సిరి. అన్ని పాత్రల్నీ దర్శకుడు చాలా చక్కగా తీర్చిదిద్దార’’న్నారు మేఘా ఆకాశ్‌. ‘‘కథే ఈ సినిమాకి హీరో. మేఘా ఆకాశ్‌ నటన ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంద’’ని నిర్మాత తెలిపారు.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM