ఈ వారంలో సందడి చేయనున్న క్రొత్త సినిమాలు

by సూర్య | Mon, Sep 25, 2023, 04:19 PM

సెప్టెంబర్‌ నెల చివరలో థియేటర్‌లో సందడి చేయడానికి సినిమాలు సిరీస్‌లు వరుసకట్టాయి. అవేంటో చూద్దాం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘స్కంద’. రామ్‌ పోతినేని కథానాయకుడు. శ్రీలీల, సయీ మంజ్రేకర్‌ నాయికలు. శ్రీనివాస చిట్టూరి నిర్మాత. ఈ నెల 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ‘స్కంద’ విడుదల కానుంది. అలానే,  శ్రీకాంత్‌ అడ్డాల , విరాట్‌ కర్ణను హీరోగా పరిచయం చేస్తూ  యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పెదకాపు - 1’ తెరకెక్కించారు. రవీందర్‌ రెడ్డి మిర్యాల ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రగతి శ్రీవాస్తవ కథానాయిక. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.పి.వాసు దర్శకత్వంలో  ‘చంద్రముఖి’  సీక్వెల్‌గా ‘చంద్రముఖి-2’ వస్తోంది. రాఘవ లారెన్స్‌, కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రధారులు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే, వేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ వివాదాల నడుమ విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ సినిమా తర్వాత భారీ బడ్జెట్‌తో పెద్ద నిర్మాణ సంస్థలు ఆఫర్లు ఇచ్చినా ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రంతో వచ్చిన లాభాలతో కరోనా సమయంలో వ్యాక్సిన్‌ తయారీకి శాస్త్రవేత్తలు పడ్డ కష్టాన్ని చూపించడానికి వివేక్‌ ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ రూపొందించారు. వైద్యులు, పరిశోధకులు చేసిన గొప్పసేవలకు ఈ సినిమా నివాళిగా నిలుస్తుందని చిత్రం బృందం చెబుతోంది. ఈ నెల 28న ఈ చిత్రం విడుదల కానుంది.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM