యానిమల్ చిత్రం నుండి రష్మిక పోస్టర్ విడుదల

by సూర్య | Sat, Sep 23, 2023, 03:30 PM

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా, ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘యానిమల్’. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్ర ఎక్జయిటింగ్ టీజర్ సెప్టెంబరు 28న విడుదల కానుంది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సీనియర్ స్టార్ హీరో అనిల్ కపూర్ లుక్‌ని కూడా మేకర్స్ పరిచయం చేశారు. ఇప్పుడు మేకర్స్ తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా లుక్‌ని వదిలారు. ఇందులో రష్మిక మందన్నా.. గీతాంజలి పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుపుతూ.. నిండైన చీరకట్టులో ఉన్న ఆమె లుక్‌ని రివీల్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే రష్మిక మందన్నా పేరు కూడా వరల్డ్ వైడ్‌గా టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 1 డిసెంబర్ 2023న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Latest News
 
డైరెక్టర్ కార్తీక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మిరాయ్' టీమ్ Mon, Oct 28, 2024, 06:25 PM
బిగ్ బాస్ తెలుగు S8లో 'క' టీమ్ Mon, Oct 28, 2024, 06:19 PM
సినిమాగా రానున్న మీర్జాపూర్ సిరీస్ Mon, Oct 28, 2024, 06:07 PM
వైజాగ్ వాసులతో 'కంగువ' చూడాలని తన కోరికను వ్యక్తం చేసిన సూర్య Mon, Oct 28, 2024, 06:01 PM
'రాబిన్‌హుడ్' టీజర్ విడుదల ఎప్పుడంటే..! Mon, Oct 28, 2024, 05:55 PM