సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'ధృవ నచ్చతిరమ్'

by సూర్య | Fri, Sep 22, 2023, 08:52 PM

గౌతమ్ మీనన్‌ దర్శకత్వంలో స్టార్ హీరో చియాన్ విక్రమ్ అధికారకంగా ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'ధృవ నచ్చతిరమ్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని CBFC నుండి U/A సర్టిఫికేట్ పొందినట్లు సమాచారం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.

ఈ సినిమాలో విక్రమ్ కి జోడిగా రీతూ వర్మ నటిస్తుంది. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, పార్తీబన్, సిమ్రాన్, రాధిక, దివ్య దర్శిని కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్పై థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో జాతీయ భద్రతా ఏజెన్సీ కోసం పనిచేసే 10 మంది రహస్య ఏజెంట్లస్ లో విక్రమ్ టీమ్ హెడ్ పాత్రలో కనిపించనున్నాడు.


ఒండ్రాగా ఎంటర్‌టైన్‌మెంట్, కొండడువోం ఎంటర్‌టైన్‌మెంట్ మరియు ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ధృవ నచ్చతిరమ్‌కి హారిస్ జయరాజ్ సంగీతం అందించారు.

Latest News
 
లోకేష్ కనగరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ పై సూర్య వ్యాఖ్యలు Wed, Oct 30, 2024, 06:08 PM
'అమరన్‌' నుండి ఉయిరేయ్ సాంగ్ అవుట్ Wed, Oct 30, 2024, 06:02 PM
'విశ్వం' తాత్కాలిక OTT విడుదల తేదీ Wed, Oct 30, 2024, 05:53 PM
150కి పైగా ప్రీమియర్ షోలతో 'లక్కీ బాస్కర్' Wed, Oct 30, 2024, 05:47 PM
ప్రీమియర్ తేదీని లాక్ చేసిన నయనతార వివాహ డాక్యుమెంటరీ Wed, Oct 30, 2024, 05:42 PM