by సూర్య | Fri, Sep 22, 2023, 07:24 PM
సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటించిన 'ఏజెంట్' సినిమా ఏప్రిల్ 28, 2023న విడుదల అయ్యింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా సక్సెస్ కాలేదు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని సోనీ లివ్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజా అప్‌డేట్ ప్రకారం సోనీ LIV ప్లాట్‌ఫారమ్‌లో ఏజెంట్ సెప్టెంబర్ 29న డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య నటిస్తుంది. ఈ హై బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ కంపోజర్ హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తున్నారు.