by సూర్య | Fri, Sep 22, 2023, 06:51 PM
ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన 'మార్క్ ఆంటోని' సినిమా సెప్టెంబర్ 15, 2023న థియేటర్లలో విడుదలఅయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలో విడుదలైన 5 రోజులలో బాక్స్ఆఫీస్ వద్ద 5.95 కోట్లు వసూళ్లు చేసింది.
ఈ చిత్రంలో విశాల్ సరసన రీతూ వర్మ జోడిగా నటిస్తుంది. ఈ చిత్రంలో ఎస్ జె సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రానికి మినీ స్టూడియోస్ బ్యానర్‌పై వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు.
Latest News