by సూర్య | Fri, Sep 22, 2023, 04:16 PM
మహేష్ బాబు పి దర్శకత్వంలో అనుష్క శెట్టి మరియు నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రం సెప్టెంబర్ 7, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటు సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 22.04 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.
మురళీ శర్మ, జయసుధ, తులసి తదితరులు ఈ రోమ్-కామ్ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. రాధన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' కలెక్షన్స్::::::
తెలుగు రాష్ట్రాలు : 12.58 కోట్లు
KA + ROI : 1.72 కోట్లు
OS : 7.74 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 22.04 కోట్లు (42.54 కోట్ల గ్రాస్)