'OG' కొత్త షెడ్యూల్‌లో జాయిన్ అయ్యిన పవర్‌స్టార్

by సూర్య | Fri, Jun 09, 2023, 07:00 PM

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాని యంగ్ డైరెక్టర్ సుజీత్‌ దర్శకతంలో చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్-అడ్వెంచర్ చిత్రానికి తాత్కాలికంగా 'OG' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ పెట్టారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ లేకుండా ఓజీ మూడో షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ లో మిగిలిన నటీనటులు పాల్గొన్న కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.


లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, పవర్‌స్టార్ ఈ రోజు ఈ కొత్త షెడ్యూల్‌లో జాయిన్ అయ్యినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ సెట్స్‌పైకి వస్తున్న స్టైలిష్ పిక్చర్ ని మూవీ మేకర్స్ విడుదల చేసారు. ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌లో ప్రియాంక అరుల్ మోహన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ బిగ్గీకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాని  డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుంది.

Latest News
 
'జైలర్' 38 రోజుల AP/TS కలెక్షన్స్ Tue, Sep 26, 2023, 03:29 PM
'ఖుషి' 23వ రోజు AP/TS కలెక్షన్స్ Tue, Sep 26, 2023, 03:24 PM
'బెదురులంక 2012' 27 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Tue, Sep 26, 2023, 03:20 PM
'జవాన్' 17 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్ Tue, Sep 26, 2023, 03:16 PM
'కింగ్ అఫ్ కొత్త' 27 రోజుల AP/TS కలెక్షన్స్ Tue, Sep 26, 2023, 03:14 PM