'భగవంత్ కేసరి' టీజర్ రన్‌టైమ్ రివీల్

by సూర్య | Fri, Jun 09, 2023, 06:45 PM

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నటసింహ నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'భగవంత్ కేసరి' అనే టైటిల్‌ని మూవీ మేకర్స్ ఖరారు చేసారు. ఈ సినిమా టీజర్‌ను బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.
 
తాజాగా ఇప్పుడు టీజర్‌ను తెలుగు రాష్ట్రాల్లోని 108 థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఈ సినిమా టీజర్ రేపు ఉదయం 10:19 గంటలకు యూట్యూబ్‌లో విడుదల కానుంది. తాజా సమాచారం ప్రకారం, పవర్ ప్యాక్డ్ టీజర్ 80 సెకన్ల రన్‌టైమ్‌ను కలిగి ఉందని చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ఈ బిగ్గీలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీలీల, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. NBK108ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనున్నారు.

Latest News
 
ఒకేసారి విడుదలకి సిద్దమౌతున్న 3 చిత్రాలు Tue, Sep 26, 2023, 01:26 PM
ఇందులో పాయల్ రాజ్‌పుత్ క్యారెక్టర్ చూస్తే షాక్ Tue, Sep 26, 2023, 01:16 PM
అందరికి ఈ సినిమా స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది Tue, Sep 26, 2023, 01:12 PM
మాకు తెలియకుండా విగ్రహం పెట్టారు Tue, Sep 26, 2023, 01:06 PM
విజయ్ దేవరకొండ​ సినిమా నుంచి శ్రీలీల ఔట్​ Tue, Sep 26, 2023, 12:35 PM