ప్రభాస్ 'ఆదిపురుష్' పై ఆసక్తికర బజ్

by సూర్య | Tue, Jun 06, 2023, 07:00 PM

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌తో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ "ఆదిపురుష్" సినిమా తీసుతున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ హై బడ్జెట్ మైథలాజికల్ మూవీలో ప్రభాస్ సరసన బ్యూటీ క్వీన్ కృతి సనన్ నటిస్తుంది. సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో లంకేష్ రోల్ చేయనున్నారు. ఈ చిత్రం 16 జూన్ 2023న థియేటర్లలో విడుదల కానుంది.

తాజాగా ఇప్పుడు, ఓపెనింగ్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఉదయాన్నే షోలు వేయాలని మూవీ మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పుకారు చక్కర్లు కొడుతోంది. జూన్ 16, 2023న ప్రతిచోటా ఉదయం 4 గంటలకు షోలు ప్రారంభమవుతాయని లేటెస్ట్ టాక్. అయితే ఈ విషయం గురించి మూవీ మేకర్స్ నుండి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

సన్నీ సింగ్, విశాల్ సేథ్, దేవదత్తా నాగే, సోనాల్ చౌహాన్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అజయ్-అతుల్ జంటగా ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. T-సిరీస్ అండ్ రెట్రోఫిల్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
ఈ వారం థియేటర్స్ లో విడుదల కానున్న కొత్త టైటిల్స్ Fri, Apr 26, 2024, 03:17 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:14 PM
OTT ఎంట్రీ తేదీని లాక్ చేసిన 'డియర్' Fri, Apr 26, 2024, 03:11 PM
శుక్రవారం రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:10 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా రవి శంకర్ Fri, Apr 26, 2024, 03:07 PM