నేడు ప్రారంభమైన 'RAPO20' చివరి షెడ్యూల్

by సూర్య | Tue, Jun 06, 2023, 07:07 PM

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని పవర్‌ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో పాన్-ఇండియా సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. ఈ పాన్-ఇండియన్ మూవీ టెంపరరీగా 'RAPO 20' పేరుతో అధికారికంగా ప్రారంభించబడింది. మూవీ టీమ్ ఇటీవల అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ప్యాక్డ్ క్లైమాక్స్ సీక్వెన్స్‌ను పూర్తి చేసింది.


తాజా బజ్ ప్రకారం, ఈ మాస్ యాక్షన్ సినిమా యొక్క చివరి షెడ్యూల్‌ను ఈ రోజు మైసూర్‌లో ప్రారంభించనుంది. ఈ నెల 15 వరకు జరగనున్న ఈ షెడ్యూల్‌లో ఒక ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్, ఒక పాటను మూవీ మేకర్స్ చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్‌తో ఒక్క పాట మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది అని సమాచారం.

ఈ  సినిమాలో రామ్ సరసన శ్రీ లీల జోడిగా నటిస్తుంది. ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఫుల్ మాస్‌ ఎలిమెంట్స్‌తో రానున్న ఈ సినిమాని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.

Latest News
 
ఈ సినిమా నాకు మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది : యాక్టర్ నిఖిల్ Thu, May 02, 2024, 11:26 AM
ప్రముఖ గాయని కన్నుమూత Thu, May 02, 2024, 10:25 AM
'ప్రసన్నవదనం' లో ఆధ్య గా పాయల్ రాధా కృష్ణ Wed, May 01, 2024, 09:18 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ది వారియర్' Wed, May 01, 2024, 09:18 PM
ప్రీపోన్ అయ్యిన మమ్ముట్టి 'టర్బో' Wed, May 01, 2024, 09:14 PM