కార్తీ తదుపరి చిత్రంలో ప్రముఖ హీరో కీలక పాత్ర

by సూర్య | Fri, Jun 02, 2023, 08:56 PM

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ తన సిల్వర్ జూబ్లీ చిత్రం 'జపాన్' సినిమా షూటింగ్‌లో ఉన్నాడు. జపాన్ చివరి షెడ్యూల్ ఈ ఉదయం చెన్నైలో ప్రారంభం కాగా కార్తీ 26 ఇటీవలే ప్రారంభమైంది మరియు ఈ సంవత్సరం చివరి నాటికి ఈ చిత్రం పూర్తవుతుంది. తాజాగా ఇప్పుడు కార్తీ 27వ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఫిల్మ్ సర్కిల్స్‌లోని తాజా రిపోర్ట్స్ ప్రకారం, ప్రముఖ నటుడు అరవింద్ స్వామి కార్తీ 27 లో కీలక పాత్రలో నటించనున్నారు. కార్తీ తన 26వ ప్రాజెక్ట్‌ని పూర్తి చేసిన తర్వాత ఈ ఏడాది చివరి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించనున్న ఈ కార్తీ 27 చిత్రాన్ని 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఆయన సోదరుడు, నటుడు సూర్య నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Latest News
 
ఒకేసారి విడుదలకి సిద్దమౌతున్న 3 చిత్రాలు Tue, Sep 26, 2023, 01:26 PM
ఇందులో పాయల్ రాజ్‌పుత్ క్యారెక్టర్ చూస్తే షాక్ Tue, Sep 26, 2023, 01:16 PM
అందరికి ఈ సినిమా స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది Tue, Sep 26, 2023, 01:12 PM
మాకు తెలియకుండా విగ్రహం పెట్టారు Tue, Sep 26, 2023, 01:06 PM
విజయ్ దేవరకొండ​ సినిమా నుంచి శ్రీలీల ఔట్​ Tue, Sep 26, 2023, 12:35 PM