‘ది కేరళ స్టోరీ’ మూవీపై కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు

by సూర్య | Sun, May 28, 2023, 11:33 PM

అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ది కేరళ స్టోరీ’. కేరళలో కొందరు అమ్మాయిలను తీవ్రవాదంలోకి  తీసుకెళ్తున్నారు అనే వివాదాస్పద కథాంశంతో ఈ సినిమా రూపొందింది.ఈ కథ నిజంగానే జరిగిందని కూడా ప్రచారం జరిగింది. దీంతో సినిమా విడుదలకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదలపై నిషేధం కూడా విధించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాపై కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “నాకు అలాంటి ప్రచార సినిమా నచ్చవు. "ట్రూ స్టోరీ" అనే టైటిల్ కింద రాసినంత మాత్రాన అది నిజమైన కథ కాదు. నేనెప్పుడూ ఒకటే చెబుతాను. అలాంటి సినిమాలకు నేను పూర్తిగా వ్యతిరేకం. తమిళనాడులో ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తమిళ హీరో కమల్ హాసన్ ఈ వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM